సౌదీ అరేబియాలో తెలుగు సమాజ సేవ, ఐక్యత, మరియు సాంస్కృతిక విలువలను ముందుకు తీసుకెళ్తున్న SATA (Saudi Arabia Telugu Association) ఆధ్వర్యంలో దమ్మాం ఈస్ట్రన్ రీజియన్లో నిన్న నిర్వహించిన తొలి SATA EASTERN కలయిక విశేష విజయాన్ని సాధించింది.
చాలా తక్కువ సమయం నోటీసులో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సమాజ సేవకులు, వాలంటీర్లు, యువత, కుటుంబ సభ్యులు, మరియు తెలుగు సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై SATA పట్ల తమ అంకితభావాన్ని చాటిచెప్పారు.
ఈ సమావేశం కేవలం ఒక పరిచయ వేదికగానే కాకుండా, తెలుగు సమాజ ఐక్యత, సేవా దృక్పథం, మరియు భవిష్యత్ కార్యాచరణకు బలమైన పునాది వేసిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
సమావేశంలో మాట్లాడిన SATA ప్రతినిధులు, విదేశాల్లో జీవిస్తున్న తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సమయంలో SATA ఎలా అండగా నిలుస్తుందో వివరించారు.
ఆపదలో ఉన్న కార్మికులకు సహాయం చేయడం, ఆసుపత్రుల్లో చిక్కుకున్న వారికి వైద్య సహాయం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయడం, ఆహారం మరియు వసతి కల్పించడం, అవసరమైన పత్రాలు మరియు లీగల్ సపోర్ట్ అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను SATA గత కొన్నేళ్లుగా నిస్వార్థంగా నిర్వహిస్తోంది.
ప్రత్యేకంగా సామాజిక సేవ పేరుతో మోసాలు పెరుగుతున్న ఈ కాలంలో, నిజాయితీతో పనిచేసే సేవా సంస్థలు ఐక్యంగా నిలబడటం ఎంత ముఖ్యమో సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.
“సేవ పేరుతో వ్యాపారం చేసే వారికి, వ్యాపారం పేరుతో మోసం చేసే వారికి — మన ఐక్యతే గట్టి సమాధానం” అనే సందేశం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపింది.
SATA సభ్యులు మాట్లాడుతూ,
“మనము ఒక్కొక్కరిగా కాదు… ఒక కుటుంబంలా నిలబడితే తెలుగు వాడి గౌరవం, గర్వం, ప్రతిష్ట ప్రపంచం ముందుకు మరింత ఎత్తుకు చేరుతుంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమాజ సేవలో నిరంతరం కృషి చేస్తున్న వాలంటీర్లను SATA ప్రత్యేకంగా అభినందించింది. తక్కువ నోటీసులోనూ కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపిన ప్రతి సేవకుడికి కృతజ్ఞతలు తెలియజేసింది.
సమావేశంలో భవిష్యత్లో ఈస్ట్రన్ రీజియన్లో చేపట్టబోయే సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, యువత భాగస్వామ్యం, మహిళల అభివృద్ధి, మరియు అత్యవసర సహాయ బృందాల బలోపేతంపై కూడా చర్చ జరిగింది.
ఈ కలయిక ముగింపులో సభ్యులందరూ సమాజం కోసం మరింత బాధ్యతతో పనిచేయాలని సంకల్పించారు.
“ఇది కేవలం ఒక మీట్ కాదు… ఇది ఒక ఆరంభం. ఒక ఉద్యమం. ఒక బాధ్యత.
మన సేవే మన గుర్తింపు” అనే సందేశంతో కార్యక్రమం ఉత్తేజభరిత వాతావరణంలో ముగిసింది.
జై హింద్ 🇮🇳
SATA TEAM