Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Upcoming — Dussehra (Vijayadashami) Celebrations! • Stay tuned for the date & venue • Come celebrate with the SATA family

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

సాటి మనిషికి అండగా నిలబడటమే నిజమైన సేవ- SATA

26 Jul 2026 SATA Core Team

ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వచ్చి గత 17 సంవత్సరాలుగా నిజాయితీగా డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీ సుబ్బారెడ్డి గారు, అనుకోని పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

తన యజమాని అభ్యర్థన మేరకు తన ఇఖామా పేరుపై కారు తీసుకున్నారు. అయితే ఆ కారుకు సంబంధించిన రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో, 15,000 సౌదీ రియాల్స్ జరిమానా ఆయన పేరుపై నమోదైంది. దీనివల్ల ట్రావెల్ బ్యాన్, ఇఖామా రిన్యువల్ సమస్యలు వంటి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. గత మూడు నెలలుగా జీతం కూడా అందకపోవడంతో, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయారు.

ఇంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ, తన కుటుంబానికి కూడా తన బాధలను చెప్పుకోకుండా, పరువు గల వ్యక్తిగా అన్నింటినీ మనసులోనే దాచుకుని జీవించారు. తన కుమారుడి వివాహం వంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మౌనంగా పోరాడారు.

ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. షుగర్ స్థాయిలు 200 నుండి 350 వరకు ఉండటం, ఒక చేయి సరిగా పనిచేయకపోవడం వల్ల చివరకు సహాయం కోసం SATA (Saudi Arabian Telugu Association) సభ్యులను సంప్రదించారు.

విషయం తెలిసిన వెంటనే SATA కోర్ టీమ్ సభ్యులు శ్రీ వెంకట్ రావు గారు మానవత్వంతో ముందుకు వచ్చి, రెండు సార్లు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి, KIMS హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించారు. అవసరమైన మందులు, విటమిన్లు, సప్లిమెంట్లు కొనిపెట్టడంతో పాటు, వ్యక్తిగతంగా ధైర్యం చెప్పి, అవసరమైన సహాయాన్ని కూడా అందించారు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యుడిలా ఆయనతో ఉండి అన్ని విధాలుగా అండగా నిలిచారు.

ప్రస్తుతం శ్రీ సుబ్బారెడ్డి గారి ఎగ్జిట్ ప్రక్రియ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను SATA సేకరిస్తోంది. అలాగే 15,000 రియాల్స్ జరిమానా విషయంలో చట్టపరమైన పరిష్కారం కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యజమాని కూడా ఈ కేసుకు సంబంధించి కోర్టులో పోరాడుతున్నట్లు సమాచారం.

ఈ సంఘటన ప్రతి ప్రవాస భారతీయుడికి ఒక ముఖ్యమైన హెచ్చరిక.

దయచేసి మీ ఇఖామా పేరుపై ఇతరుల కోసం కారు లేదా కార్ లోన్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా, దాని పూర్తి బాధ్యత మీ పర్యవేక్షణలోనే ఉండేలా చూసుకోండి. లేకపోతే జరిమానాలు, ట్రావెల్ బ్యాన్, ఇఖామా రిన్యువల్ సమస్యలు, దేశం విడిచి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటివరకు ఇలాంటి 13 కేసులు SATA దృష్టికి వచ్చాయి. అందుకే ప్రతి ఒక్కరూ సౌదీ అరేబియా చట్టాలు, నిబంధనలను గౌరవిస్తూ, పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి.

మీకు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే, మౌనంగా బాధపడకండి. మీ సమస్యను బయటకు చెప్పండి. SATA మీకు చేతనైన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

“సేవే మా ధ్యేయం… కష్టాల్లో ఉన్న ప్రతి తెలుగు కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత.”