Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Upcoming — Dussehra (Vijayadashami) Celebrations! • Stay tuned for the date & venue • Come celebrate with the SATA family

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం – సాటా సేవా స్ఫూర్తి

16 Jun 2026 SATA Core Team

ఊరు కాని ఊరు… దేశం కాని దేశం… జీవితంలోనే అత్యంత విషాదకరమైన క్షణాల్లో ఒక కుటుంబం ఎటు వెళ్లాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అండగా నిలవడం నిజమైన మానవత్వం.

కర్ణాటకకు చెందిన శ్రీమతి వాణి తిమ్మయ్య గారు అనారోగ్య కారణాలతో సౌదీ అరేబియాలో కన్నుమూశారు. ఆమె భర్త తీవ్ర విషాదంలో ఉండటమే కాకుండా, చివరి కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ప్రక్రియలు, అధికారిక అనుమతులు, పత్రాల గురించి ఎటువంటి అవగాహన లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

ఈ క్లిష్ట సమయంలో సమాచారం అందుకున్న సాటా (Saudi Arabian Telugu Association) సభ్యులు వెంటనే స్పందించారు. ఈ సేవా కార్యక్రమానికి సాటా అధ్యక్షులు ఆనందరాజు గారి మార్గదర్శకత్వంలో, సాటా ER సర్వీస్ ప్రెసిడెంట్  ఫరూక్ గారి నాయకత్వంలో సభ్యులు ముందుకొచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేయడం, మరణ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సంబంధిత ప్రక్రియలు, అవసరమైన అనుమతులు మరియు ఖననానికి సంబంధించిన అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసి, మూడు రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నిలిచారు. చివరకు వాణి తిమ్మయ్య గారికి గౌరవప్రదంగా ఖననం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సేవ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు; ఇది సాటా సభ్యుల మానవత్వానికి, సేవా దృక్పథానికి నిదర్శనం. కష్టాల్లో ఉన్న ఒక భారతీయ కుటుంబానికి అండగా నిలిచి, వారి బాధను తమ బాధగా భావించి చివరి వరకు తోడుగా ఉండటం సాటా సేవా తత్వాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఈ సందర్భంగా మృతురాలి భర్త సాటా సర్వీస్ ప్రెసిడెంట్ ఫరూక్ గారికి, అలాగే ఈ సేవలో పాల్గొన్న ప్రతి కార్యవర్గ సభ్యునికి మరియు కోర్ టీమ్ సభ్యునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాభివందనాలు చేశారు.

ఆపదలో ఉన్న భారతీయులకు అండగా నిలవడం సాటా సేవా ధ్యేయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని, మరింత మంది అవసరంలో ఉన్నవారికి సాటా ఆశాకిరణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రెస్ ప్రకటన విడుదల చేయబడుతోంది.

“సేవే పరమో ధర్మః – ఆపదలో అండగా నిలవడమే నిజమైన మానవత్వం.”

 

 

సేవకు సరిహద్దులు లేవు… మానవత్వానికి ప్రాంతీయత లేదు

ఈ సందర్భంగా మరో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇదే వారంలో సాటా సేవా కార్యక్రమాల్లో రెండవ విషాదకర ఘటన కూడా చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన కార్మికుడు శ్రీ సత్యనారాయణ గారు సౌదీ అరేబియాలో మరణించారు. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న ఆయన మరణం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అంతేకాకుండా కంపెనీ నుండి రావాల్సిన సుమారు 30,000 రియాల్స్‌కు పైగా ఉద్యోగ ప్రయోజనాలు మరియు ఇతర బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ క్లిష్ట సమయంలో సాటా ఈస్ట్రన్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. ఫరూక్ గారు వ్యక్తిగతంగా ముందుకు వచ్చి, కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి, రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణలోని కుటుంబ సభ్యులు, ఎయిర్‌లైన్స్ అధికారులు మరియు సంబంధిత విభాగాలతో నిరంతరం సమన్వయం చేస్తూ, మృతదేహం స్వగ్రామానికి చేరుకునే వరకు ప్రతి అంశాన్ని తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేశారు.

మృతదేహం భారతదేశానికి చేరుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించి, చివరి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ నిలిచిన ఫరూక్ గారి సేవా భావనకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సాటాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా ఏ ఇతర రాష్ట్రం అనే భేదం లేదు. భారతీయుడు ఎక్కడ కష్టంలో ఉన్నా, మానవత్వం కోసం ముందుకు రావడమే సాటా ధ్యేయం. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, బాధ మాత్రం ఒకటేనని భావిస్తూ ప్రతి ఆపదలో అండగా నిలుస్తోంది.

సాటా అధ్యక్షులు ఆనందరాజు గారు, సోషల్ సర్వీస్ టీమ్, మహిళా అధ్యక్షురాలు సుచరిత గారు, ఈస్ట్రన్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. ఫరూక్ గారు, సహాయక సభ్యులు ముజామిల్ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు తమ వ్యక్తిగత సమయాన్ని, శ్రమను వెచ్చిస్తూ ఎడారి జీవితంలో ఉన్న వేలాది భారతీయులకు ఒక భరోసాగా నిలుస్తున్నారు.

“ఎడారి నేలపై భారతీయుల కన్నీటికి అండగా నిలిచే పేరు – సాటా.”

“ఆపదలో అండగా… చివరి మజిలీ వరకు తోడుగా… ఇదే సాటా సేవా తత్వం.”