సరైన అర్హతలు కల్గిన వారు మాత్రమే విదేశాలకు రావాలని, మధ్యవర్తులను నమ్మి అడ్డదారిలో వస్తే ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయని సౌదీలోని తెలుగు సామాజిక కార్యకర్తలు హెచ్చరించారు.
ఎలాంటి అనుభవం, పరిజ్ఞానం లేకున్నా తాము వృత్తి నిపుణులమంటూ గల్ఫ్ దేశాలలోని యజమానులను బురిడీ కొట్టించడంలో ఒకప్పుడు భారతీయులు అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకులు ఉండే వారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. గల్ఫ్ దేశాలతో పాటు స్వదేశంలో పెరుగుతున్న సంస్కరణల కారణంగా పారదర్శకత పెరిగింది. దీంతో మోసపూరితంగా గల్ఫ్కు వెళ్లడం, ఒక వేల్లినా మనుగడ సాగించడం కష్టతరంగా ఉంది.
తాము వృత్తి నిపుణులమంటూ అడ్డదారిన దళారుల సహాయంతో సౌదీ అరేబియాకు చేరుకొన్న నలుగురు తెలుగు యువకులు తమ తప్పిదం తెలుసుకుని నాలుగు నెలల తర్వాత అతి కష్టంగా స్వదేశానికి తిరిగి వెళ్ళారు. విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లి జిల్లా కశింకోట మండలానికి చెందిన నలుగురు యువకులు కొద్ది నెలల క్రితం ఏ రకమైన అనుభవం లేకున్నా ఫిట్టర్లుగా సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేయడానికి వచ్చారు. వాస్తవానికి ఈ ఉద్యోగంలో అర్హత సాధించడానికి వీరు విశాఖపట్టణంలో జరిగిన ఇంటర్వ్యూ, పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. కానీ వీరు అక్రమ మార్గన అక్కడ ఒక ఏజెంటు సహాయంతో పాస్ అయినట్లుగా నిరూపించుకుని సౌదీ అరేబియాలోని దమ్మాం నగరానికి చేరుకున్నారు. సౌదీలోని ఒక ప్రముఖ కంపెనీ వీరికి ఉద్యోగంలో నియామకానికి ముందు పరీక్ష నిర్వహించగా అందులో వీరందరు ఫెయిలయ్యారు, దీంతో వీరిపై జాలిపడ్డ కంపెనీ వీరికి భారతదేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిట్టర్ కాకుండా లేబర్గా ఆ స్థాయి వేతనంపై పని చేయాలని సూచించగా వీరు నిరాకరించి ఇంట్లో కూర్చున్నారు.
SATA సంస్థ ఉద్యోగాలు లేదా వ్యాపారాల పేరుతో ఎవరినీ మోసం చేయదు. ఎవరి కష్టాన్ని తక్కువగా విలువ చేసి లాభపడదు. SATA ఎప్పుడూ వ్యక్తిగత లాభం కంటే తెలుగు మరియు భారతీయ సమాజ అభివృద్ధినే ముఖ్యంగా భావిస్తుంది.
SATA సభ్యుల్లో చాలా మంది ఎలాంటి లాభం లేదా గుర్తింపు ఆశించకుండా స్వచ్ఛందంగా సహాయం అందిస్తున్నారు. అదే మన మానవత్వానికి నిజమైన నిర్వచనం.
మాతో కలిసి నిలబడి ఈ విలువలను కాపాడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారంతో, ఈ విదేశీ నేలపై మన సమాజానికి మద్దతుగా నిలిచే బలమైన దీపస్తంభంగా కొనసాగుతున్నాం.
🙏🙏🙏🙏🙏
